Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగి రికార్డు సృష్టించారు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కేవలం 68 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ షాయ్ హోప్ 94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరితో పాటు అమీర్ జంగూ అద్భుతమైన బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. జంగూ 77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్ 29 పరుగులతో, షమర్ జోసెఫ్ 14 పరుగులతో నాటౌట్ నిలిచారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా, గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు. అయితే భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్ 96 పరుగులు ఇచ్చి ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో మొత్తం 23 ఎక్స్‌ట్రాలు లభించాయి. వన్డే చరిత్రలో భారత్‌పై నమోదైన అత్యధిక స్కోర్లలో ఇది మూడో స్థానంలో నిలిచింది.
Also Read
- Chairman's Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
- Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
- Off The Record: సూర్యాపేట కాంగ్రెస్ ను ముంచుతున్న గ్రూప్ వార్..!
- CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
ఇన్నింగ్స్ విరామం అనంతరం భారత్ తరఫున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెవీ రోలర్ కోరడం ద్వారా పిచ్‌ను బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చాలని భావించాడు. మైదానంలో చిన్న బౌండరీలు ఉండటం, మంచు (డ్యూ) ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించవచ్చని టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే ప్రారంభ ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా ఆడటం భారత్‌కు ఎంతో కీలకం కానుంది. వెస్టిండీస్ బ్యాటర్ల సుడిగాలి ఇన్నింగ్స్‌ల కారణంగా మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. నిర్ణీత సమయంలో భారత్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!