AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే అవకాశం.. ఇలా సంప్రదించండి..
AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో చూడడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి.. ప్రత్యక్షంగా మన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష నేతలు ఎక్కడ కూర్చుంటారు.. స్పీకర్ ఎటువైపు ఉంటారు? అసెంబ్లీలో సెక్యూరిటీ ఏంటి? అక్కడ ఉండే ఇతర సదుపాయాలు ఏంటి? అని ప్రత్యక్షంగా చూడడం.. తెలుసుకోవడం ఎవరికైనా ఇష్టమే.. అలాంటి అవకాశం విద్యార్థులకే వస్తే.. ఎగిరి గంతేస్తారు.. అయితే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా అసెంబ్లీ సభలో వీక్షించుకునే అవకాశం కల్పించనున్నారు.
అసెంబ్లీ జరిగే ప్రతి రోజు విద్యార్థులు సభ సమావేశాలను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. చట్టసభల పట్ల విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.. ఇందుకు సంబంధించి స్కూల్స్, కాలేజీలు తమ విద్యార్థులను తరలించేందుకు ముందుగా అసెంబ్లీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించారు.. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులు.. 45 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.. వివరాల కోసం ఆసక్తి ఉన్న స్కూల్/కాలేజీలు ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు 0863-2449184, 0863-2449185 అని సూచించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..
-
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
-
Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
-
Travis Head: SRH ఫ్యాన్స్‌కు షాక్.. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో ఇంత మార్పా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
-
Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!