Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..
- కవల పిల్లలను హత్య చేసిన తండ్రి
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన
- నిందితుడైన, మెడికల్ రిప్రజెంటేటివ్ శశి రంజన్ మిశ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభంశుభం తెలియని చిన్నారుల మరణశాసనం రాశాడు. కవల కూతుర్లను గొంతు కోసి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 48 ఏళ్ల వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున తన ఫ్లాట్‌లో పదునైన ఆయుధంతో తన 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడైన, మెడికల్ రిప్రజెంటేటివ్ శశి రంజన్ మిశ్రా, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన కుమార్తెలను హత్య చేసినట్లు తెలియజేశాడు. బీహార్ నివాసి అయిన అతను తన భార్య రేష్మా, వారి కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు.
Also Read:Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
శనివారం రాత్రి భోజనం చేశాక శశి అమ్మాయిలను పడుకోబెట్టాడని పిల్లల తల్లి చెప్పింది. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు అతను కూతుళ్లలో ఒకరిని స్నానాల గదికి తీసుకెళ్లాడని, ఆ తర్వాత వాళ్లు గదికి తిరిగి రాగా లైట్లు ఆర్పేశాడని తెలిపింది. రెండు గంటల తర్వాత, అతను పోలీసుల అత్యవసర సేవా నంబర్‌కు ఫోన్ చేసి, తాను పిల్లలను హత్య చేసినట్లు తెలిపాడు. వెంటనే ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు, లోపల శశి ఉండగా, ఇద్దరు అమ్మాయిలు గొంతులు కోసి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. తండ్రిని అరెస్టు చేశాం, కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి విలేకరులకు వెల్లడించారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలం ఈ విషయాన్ని మరింత తీవ్రతరం చేసింది. భార్య చెప్పిన ప్రకారం, 2014లో వారిది ప్రేమ వివాహం. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందినది కాగా, ఆమె భర్త బీహార్‌కు చెందినవాడు. వీరిద్దరూ కాన్పూర్‌లో కలిసి పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. పెళ్లయిన కొద్దికాలానికే వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయని తెలిపింది.
Also Read:Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!
తన భర్త తరచుగా మద్యం సేవించి తనపై శారీరకంగా దాడి చేసేవాడని రేష్మా చెప్పింది. పుట్టింటికి కూడా పంపేవాడు కాదని ఆరోపించింది. కనీసం బయటకు కూడా వెళ్లనిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు కుమార్తెలను తనతోనే ఉంచుకుంటానని పట్టుబట్టి, కొడుకును తీసుకుని వేరే చోటికి వెళ్ళమని తన భర్త పదేపదే చెప్పాడని ఆమె ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?