Hairy Tongue : కాలం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. రోజుకో కొత్త రోగం మార్కెట్లోకి వస్తుంది. తాజాగా జపాన్ లో ఓ మహిళకు వచ్చిన జబ్బు గురించి తెలిస్తే నిజంగా అవాక్కవ్వాల్సిందే. చాలా మందికి నాలుక మీద మచ్చలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే విచిత్రంగా ఓ మహిళకు నాలుక మొత్తం బ్లాక్ గా మారిపోయి, వెంట్రుకలు పెరిగాయి. ఈ కొత్త రోగం గురించి పూర్తిగా తెలుసుకుందాం.. మనకు ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే దగ్గర్లోని మెడికల్ షాపునకు వెళ్లి మెడిసిన్స్ తెచ్చుకుంటా. ఇలా చేసే జపనీస్ మహిళ కష్టాలు కొని తెచ్చుకుంది. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడిన 60 ఏళ్ల మహిళ నాలుకపై వెంట్రుకలు వచ్చి నల్లగా మారి..ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లగా వింత జబ్బు సోకిందని వైద్యులు తేల్చారు. పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు చేసి లింగువా విల్లోసా నిగ్రా (బ్లాక్ హెయిర్ టంగ్-BHT) వ్యాధి తనకు సోకినట్టు తెలిపారు.
Read Also:Andhrapradesh: ప్రెగ్నెంట్లకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ సేవలు ఉచితం
ఈ మహిళ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దాదాపు 14 నెలల క్రితం నుంచి కీమోథెరపీ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో వైద్యులు ఆ స్త్రీకి మినోసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కానీ ఈ మందు వల్ల మహిళ ముఖంపై నల్లటి మచ్చలు.. నాలుకపై జుట్టు వచ్చి నల్లబడిందని వైద్యులు తెలిపారు. యాంటి బయాటిక్స్ వల్ల ఆరోగ్యం కంటే దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీబయాటిక్స్‌తో ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని వైద్యులు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని.. కాని ముఖంపై మచ్చలు కనపడతాయి. అప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే మందులు మారుస్తారు. ఈ మహిళకు మందులు మార్చడంతో 6 వారాల తర్వాత ముఖంపై మచ్చలు తగ్గాయి. అయితే నాలుక పొడిబారే సమస్య ఉన్న వారిలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని, జుట్టు పెరుగుతుందని డాక్టర్లు చెప్పారు.
Read Also:Hawala money: రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో ట్విస్ట్.. బయటపడిన హవాలా సొమ్ము