Team India: టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతని మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రేపు జరిగే కీలక మ్యాచ్లో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దూరమై.. టీమిండియా కొంత నిరాశతో ఉంటే జడ్డూ రేపటి మ్యాచ్లో ఆడకపోతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
Read Also: Asaduddin Owaisi: పాలస్తీనా అరబ్బుల భూమి.. ఇజ్రాయిల్ ఆక్రమించింది..
ఇంతకుముందు టీ20 ప్రపంచకప్-2022లో మోకాలి గాయం కారణంగా జడేజా ట్రోఫీకి దూరమయ్యాడు. అప్పుడు తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి జట్టులో కొనసాగుతున్న జడ్డూ.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎడమ మోకాలికి ఐస్ ప్యాక్ వేసుకుంటూ కన్పించాడు. ఫీల్డింగ్ లో యాక్టివ్‌గా కన్పించాడు. ఇదిలా ఉంటే జడ్డూ గాయంపై బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఆ గాయం అంత తీవ్రమైనది కాదని.. ప్రస్తుతం జడేజా బాగానే ఉన్నాడన్నారు. శస్త్రచికిత్స జరిగినప్పడు కొన్నిరోజుల పాటు విశ్రాంతి అవసరమని. ముఖ్యంగా మోకాలి గాయాలు తిరగబెడతాయని తెలిపారు.
Read Also: Ashok Galla: హనుమంతుడి టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ మేనల్లుడితో అంటే…