Ashok Galla: హనుమంతుడి టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ మేనల్లుడితో అంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devdatta Nage Playing Kamsaraju Role In Ashok Galla Second Movie First Look Released:’హీరో’ సినిమాతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #Ashok Galla2 పేరుతో సంభోదిస్తున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సోమినేని బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాతగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆదిపురుష్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మెరిసిన దేవదత్త నాగే ఈ సినిమాలో కంసరాజు అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
Narakasura: నిందాస్తుతిలో శివుడ్ని ప్రశ్నిస్తున్న పలాస హీరో
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఇక తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందులో కత్తి పట్టుకుని చాలా వయలెంట్ గా కనిపించారు ఆయన. ఇక ఆదిపురుష్ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మహేష్ మేనల్లుడు ఆయనకు ఎంతవరకు పనికి వస్తాడో. ఇక ఆ సంగతి పక్కన పెడితే అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ధమాకా, బలగం లాంటి సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేసి టీజర్ ను రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!