తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఒక్క సినిమా అతన్ని స్టార్ డైరెక్టర్ ను చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా అతని ఇమేజ్ ను పెంచేశాయి..తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్..ఈ డైరెక్టర్ పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పటాస్ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 లాంటి లు చేసి ఆకట్టుకున్నాడు.
ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో చేస్తున్నారు. మొదటి సారి సీనియర్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ తెరకెక్కుతోంది.. ఇక ఈ సినిమాలో గతంలో ఎప్పుడు కనిపించని విధంగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ లో కాజల్, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక ఈ చిత్రం తర్వాత అనిల్ ఎవరితో చేయనున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇదిలా ఉంటే బాలయ్య తర్వాత అనిల్ మరో స్టార్ హీరోతో చేయాలని చూస్తున్నారట. బాలయ్య తర్వాత అనిల్ ఎన్టీఆర్ తో చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో పటాస్ చేసిన అనిల్, ఇప్పుడు బాలయ్యతో చేస్తున్నాడు. ఇలా నందమూరి హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్న అనిల్ కు ఎన్టీఆర్ కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ తో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది..