రష్యా కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ఆర్మీ “వాగ్నర్ గ్రూప్” ఈ ఏడాది జూన్ 23న ఆయనపైనే తిరగబడింది. పుతిన్‌పై తిరుగుబాటును లేవనెత్తిన ప్రైవేట్ ఆర్మీ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించిగా అతని మృతిపై పలు దేశాలు అనుమానం కూడా వ్యక్తం చేశాయి. పుతిన్ కు ఎదురుతిరగడం వల్లే ప్రిగోజిన్ కాలగర్భంలో కలిసిపోయాడంటూ అనేక కథనాలు కూడా వచ్చాయి. ఇక తాజా ఈ కిరాయి దళానికి నాయకుడిని ఎంపిక చేశారు పుతిన్. కొత్త అధిపతిగా ఆండ్రీ ట్రోషెవ్‌ను ఆయన ఎంపిక చేశారు. ఈయన సైనిక దళంలోనే పలు స్థాయిల్లో పనిచేశారు.
Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?
ఆండ్రీ ట్రోషెవ్ విషయానికి వస్తే 1953 ఏప్రిల్‌లో మాజీ సోవియట్ యూనియన్‌లోని లెనిన్‌గ్రాడ్ (సెయింట్ పీటర్స్‌బర్గ్)లో జన్మించాడు. గతంలో రష్యా సైన్యంలో పనిచేసిన ట్రోషెవ్ 2014లో వాగ్నర్ గ్రూపులో చేరాడు. గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను చూసుకున్నాడు. ఆయనను సెడోయ్’ లేదా ‘గ్రే హెయిర్’ అని కూడా పిలుస్తారు. ట్రోషెవ్.. రష్యా ఆర్మీ రిటైర్డ్ కల్నల్. వాగ్నర్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యులలో అతడు ఒకరు.బషర్ అల్-అస్సాద్ నేతృత్వంలోని సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రష్యా ప్రైవేట్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్స్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా వ్యవహరించాడు ట్రోషెవ్. ఇతనిపై ఐరోపా సమాఖ్య అనేక ఆంక్షలు విధించింది. బ్రిటన్ దేశం ఆర్థిక ఆంక్షలు విధించిన వాగ్నర్ గ్రూప్ క్రూరమైన సైనిక కమాండర్ల లిస్టులో ట్రోషెవ్ కూడా ఉన్నారు. ఇలాంటి రికార్డులన్ని ఉన్నాయి కాబట్టే పుతిన్ ఏరికోరి ట్రోషెవ్ ను కిరాయ దళానికి లీడర్ గా ఎంపిక చేశారు. అంతక ముందు ఆయన ఈ గ్రూప్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు.