Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసేలా చర్యలు
- విశాఖ, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి
- అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యoగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ‘ఏబోలా’ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా ‘ఎబోలా’ వైరస్ వ్యాప్తి, కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని మంత్రి ప్రకటించారు.
ఆఫ్రికాలోని కాoగో, ఉగాండా దేశాల్లో ఎబోలా తీవ్రత రోజురోజుకీ పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో సదరు దేశాల నుంచి రాష్ట్రంలోనికి వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులను (ట్రావెల్ హిస్టరీ ఆధారంగా) వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విషయంలో ఎయిర్ పోర్ట్ అథార్టీ, సదరు జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నేడొక ప్రకటనలో తెలిపారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
విశాఖ ఓడరేవు అధికారులతో కూడా మాట్లాడి, ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. విమానాల ద్వారా కాకుండా రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారి విషయంలోనూ అవసరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి దేశంలోని వచ్చే ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ఇందుకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని సదరు రాష్ట్రాలకు పంపుతోందని తెలిపారు. కొవిడ్ హయాంనాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ‘ఏబోలా’ విషయంలో ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ANM, ఆశ వర్కర్ల నుంచి స్థాయి నుoచి అందర్నీ ‘వర్చువల్’ సమావేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల నగరాల్లోని టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే ‘ఐసోలేషన్’ వార్డుల్లో 15 పడకల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి వస్తున్న సమాచారాన్ని జిల్లాలకు పంపుతూ అందర్ని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. పీపీఈ , వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు తక్షణ అవసరాలకు సరిపడ ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన అడ్వయిజరీ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప, కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు ప్రయాణించొద్దని మంత్రి శ్రీ స త్యకుమార్ విజ్ఞప్తిచేశారు. గత మూడు వారాల కిందట ఎబోలో ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు అనారోగ్యంగా ఉంటే జిల్లా అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు. దీనివల్ల అవసరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎబోలా (బుండిబుగ్యో) వైరస్ కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాల్లోని అనేకమందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం కష్టం. వైరస్ సోకిన వారికి కొన్నివారాలపాటు లక్షణాలు బయటపడవు. దీనివల్ల ఎక్కువ మందికి తక్కువ వ్యవధిలో సోకే అవకాశం ఉంది. సాధారణ జ్వరం, అకస్మాత్తుగా జ్వరం పెరిగిపోవడం, శరీరం మొత్తం బలహీనంగా అనిపించడం, తీవ్ర తలనొప్పి, గొంతునొప్పి, కండరాల నొప్పులు, రోజురోజుకి నొప్పులు తీవ్రమవుతుండటం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్ల ఎర్రబారడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ బారినపడిన వారిలో కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!