YSR Kapu Nestham: కాపులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈరోజు వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం..
Read Also: Ind vs Ban : భారత్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
ఈ రోజు అందిస్తున్న రూ. 536.77 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం చేసిన ఆర్థిక సాయం రూ. 2,029 కోట్లు.. ఒక్కో పేద కాపు అక్క చెల్లెమ్మకు నాలుగేళ్ళ కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000గా ఉంది.. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ. 400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 52 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ. 39,247 కోట్ల లబ్ధి చేకూర్చారు.