రేపు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు..
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నిధులు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన…