బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాజ్యం ఏలిన టాప్ హీరోయిన్ లో కాజోల్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమాల్లో కనిపించే అవకాశాలు తగ్గిపోయాయి.. అయినప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఆమె బ్యాంకు అకౌంట్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది! కష్టపడకుండానే ప్రతి నెలా లక్షల రూపాయలు ఆమె ఖాతాలో జమ అవుతున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం? అనుకుంటున్నారు. డబ్బు పెట్టుబడి విషాయాలలో సెలబ్రెటిలు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కాజోల్ ఇన్ కమ్ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read : Girija Oak: పాపులారిటీతో పాటు వేధింపులు కూడా స్టార్ట్.. “వస్తావా? గంటకు రేటెంత?” అని అడుగుతున్నారు!
కాజోల్ సంపాదన వెనుక రహస్యం రియల్ ఎస్టేట్. ముంబయిలోని బ్యాంక్ స్ట్రీట్ పక్కనే ఆమెకు ఉన్న భారీ కమర్షియల్ భవనం ప్రస్తుతం HDFC బ్యాంక్‌కు లీజుకి ఇచ్చింది. ఒప్పందం ప్రకారం వచ్చే 9 ఏళ్లలో మొత్తం రూ. 8.6 కోట్లు రెంట్ రూపంలో వస్తాయి. అంటే నెలకు దాదాపు రూ. 6.9 లక్షలు ఆమె ఖాతాలో పడతాయట. ఒక రోజు కూడా ఆఫీసుకెళ్లాల్సిన పని లేదు. కెమెరా ముందు నిలబడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతూ సంపాదిస్తోంది. ఈ భారీ ప్రాపర్టీ తో పాటు ముంబయిలో ఆమె పేరిట మరికొన్ని కమర్షియల్, రెసిడెన్షియల్ ఆసెట్లు కూడా ఉన్నాయని సమాచారం. వాటి నుంచి ప్రతీ సంవత్సరం కోట్లలో రెంట్ వస్తుందని ట్రేడ్ టాక్. ఒకప్పుడు సినిమాల ద్వారా హార్డ్ వర్క్ చేసి సంపాదించిన డబ్బును.. ఇప్పుడు స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టి మెరుగైన ఫలితం అందుకుంటోంది కాజోల్. అందుకే ‘స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దాన్ హార్డ్ వర్క్’ అంటారు. అందుకే ఇప్పుడు ఆమె బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు, స్మార్ట్ ఇన్వెస్టర్, రియల్ ఎస్టేట్ క్వీన్‌గా కూడా నిలిచింది.