టాలివుడ్ లో యాంకర్ అనసూయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది..జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా శారీలో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పటిలాగే చీరకట్టులో సైతం అనసూయ కొంటెగా కసి చూపులతో కుర్ర హృదయాల్ని తగలబెట్టే విధంగా ఫోజులు ఇస్తోంది. సిల్వర్ కలర్ చీరలో సొగసుల విందు వడ్డీస్తుంది.. అను వేసుకున్న బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంది. స్టైలిష్ గా అనిపించే బ్లౌజ్ లో అనసూయ మెరుపు తీగలా హొయలు పోతూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ తరహా బ్లౌజ్ లు ధరించి యువతని కట్టి పడేయాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
స్టైలిష్ ఐకాన్ అని ఫ్యాన్స్ లైకులతో, షేర్లతో తెగ ట్రెండ్ చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.. తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది..