తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. సీఎం చంద్రబాబు స్టేట్స్ మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్‌కి నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత? అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ఆరంభమైందని, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం స్పష్టం చేశారు. మంత్రి ఆనం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు.
‘కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం బాధేెసింది. సీఎం చంద్రబాబు స్టేట్స్ మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుంది. కేసీఆర్‌కి నచ్చితే ఎంత?, నచ్చకుంటే ఎంత?. వైఎస్ జగన్ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుని తిరుపతి జిల్లాలో కలపాలని చూసింది. కూటమి ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుతో పాటు వెంకటగిరిలో మూడు మండలాలని, గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచింది. జిల్లాకి పూర్వ వైభవం తెచ్చాం. దుర్మార్గమైన పనులుతో, నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరం’ అని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు.
Also Read: AP Liquor Sales: న్యూ ఇయర్ కిక్కు.. ఏపీలో రికార్డు లిక్కర్ అమ్మకాలు!
‘నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నాము. 2025లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించింది. ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉండటం ఆనందాన్ని ఇచ్చింది. నిన్న ఏడాది చివరి రోజు ఆనందంగా గడిచిపోయింది. చివరి రోజు కూడా మెరుగైన సేవలు అందించాము. కొందరు నేతలు, అధినాయకులు సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వంపై బురద జల్లాలని చూశారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ఆరంభమైంది. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు. కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మెరుగైన పాలన అందుతుంది’ అని మంత్రి ఆనం స్పష్టం చేశారు.