తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. సీఎం చంద్రబాబు స్టేట్స్ మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్‌కి నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత? అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ఆరంభమైందని, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం స్పష్టం చేశారు. మంత్రి ఆనం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…