మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన అన్వేషిప్పిన్ కండేతుమ్ మూవీ ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.రూ.10 కోట్ల లోపు బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు డార్విన్ కురియకోస్ తెరకెక్కించారు. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ మరింత సత్తా చాటుతోంది..నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి మార్చి 8న అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల డబ్బింగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. దీంతో నేషనల్ వైడ్‍గా నెట్‍ఫ్లిక్స్‌లో ఈ సినిమా హవా చూపిస్తోంది.ఓటీటీలో అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా చూసిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో సస్పెన్స్, ట్విస్టులు చాలా అద్భుతంగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. తప్పకుండా చూడాలని ఇతరులకు రెకమెండ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ చిత్రానికి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈవారం ఎక్కువ మంది చూసిన సినిమాగా అన్వేషిప్పిన్ కండేతుమ్ నిలిచింది. మార్చి 8నే ఆ ఓటీటీలో ఇంగ్లిష్ సినిమా డామ్‍షెల్ మరియు హిందీ మూవీ మేరీ క్రిస్మస్ కూడా వచ్చింది. అయితే, ఈ రెండింటి కంటే అన్వేషిప్పిన్ కండేతుమ్‍కే ఇప్పటి వరకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వారం నెట్‍ఫ్లిక్స్‌లో ఇండియాలో మోస్ట్ వాచ్డ్ మూవీగా సత్తాచాటింది. ఈ వారం రెండు, మూడు స్థానాల్లో డామ్‍షెల్ మరియు మేరీ క్రిస్మస్ నిలిచాయి. డంకీ, యానిమల్, గుంటూరు కారం హిందీ వెర్షన్ కూడా ఈ వారం నెట్‍ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ టాప్-10 జాబితాలో ఉన్నాయి.అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రంలో ఎస్‍ఐ ఆనంద్ నారాయణన్‍గా టోవినో థామస్ నటించారు. థామస్, సిద్ధిఖీ, బాబురాజ్, సాధిక్, షమ్మి తిలకన్, వినీత్ తత్తిల్, రాహుల్ రాజగోపాల్, ఆర్థన భాను, మనూ మరియు అనఘ రవి కీలకపాత్రలు పోషించారు. యూల్డీ ఫిల్మ్స్, థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.