Shivaji Statue: షాకింగ్ న్యూస్.. శివాజీ విగ్రహం కూలుతుందని ముందే తెలుసు.. చెప్పినా పట్టించుకోలేదు!
- కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం
- దర్యాప్తులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విగ్రహాన్ని గతేడాది నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. నేవీ, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తో సంబంధిత నిపుణులు ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌లపై భారత న్యాయ స్మృతి 109, 110, 125, 318, 3(5) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు.
READ MORE: Ram Mohan Naidu: ఏపీలో నూతన విమానాశ్రయాలు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
కాగా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విగ్రహం క్షీణించడం గురించి స్థానిక పౌరులు, పర్యాటకులు, పీడబ్ల్యుడీ మల్వాన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి హెచ్చరించినప్పటికీ, ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదని స్పష్టమైంది. విగ్రహం శిథిలావస్థకు చేరుకుందని నేవీకి లేఖ రాసినప్పటికీ విగ్రహానికి మరమ్మతులు చేయలేదని ఓ ఇంజినీర్ కుండ బద్ధలు గొట్టారు. మరోవైపు “విగ్రహం తయారీలో ఉపయోగించిన ఉక్కు తుప్పు పట్టడం ప్రారంభించింది” అని సింధుదుర్గ్ గార్డియన్ మంత్రి రవీంద్ర చవాన్ ధృవీకరించారు. ఈ విషయాన్ని నేవీ అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ పరిష్కరించేందుకు పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు