గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం అని, ఏడాది కూటమి ప్రభుత్వం పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. చంద్రబాబు నాయుడు అంటే మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదని మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని అంజద్ బాషా పేర్కొన్నారు.…