లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు ఒక్కొక్కరు రానున్నారు. గురువారం నాడు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. నగరంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ‘విజయ సంకల్ప’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఈ సభలో తాజాగా అమిత్ షా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇక ఇందులో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ..
Also Read: Fire accident: బీహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
తాను తెలుగులో మాట్లాడలేనని.. అందుకు నేను క్షమాపణ కోరుతున్నట్లు అన్నారు. అమిత్ షా మాట్లాడుతూ.. మనం మళ్ళీ మోడీ ప్రధానమంత్రి నీ చెసుకోవలవద్ద..? తెలంగాణ లో అన్ని ఎంపీ సీట్లు గెలవల లేదా..? మీరు బిజెపి కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయోధ్య లో రామ్ మందిర్ నిర్మాణం చేయడం., కాంగ్రెస్ పార్టీకి మందిర నిర్మాణం ఇష్టం లేదని.. నిర్మాణం చేయకుండా కేసులు వేసిందని ఆయన పేర్కొన్నారు. మోడీ కేసులు గెలిచి మందిర నిర్మాణ చేసి బలరాముని ప్రాణప్రతిష్ఠ చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేసి 70 ఏండ్ల సమస్యను పరిష్కరించారని ఆయన సభలో పెర్కొన్నారు.
Also Read: Malla Reddy: తన స్టైలే వేరంటూ.. మెట్రో రైల్లో ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..
వీటితోపాటు కాశ్మీర్ మన దేశంలో అంతర్ భాగమా కదా..? బిఅర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే.. ఈ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. భారతదేశంలో అవినీతి ప్రోషహించినవి. అందులో కళేస్వరం కావచ్చు.. ఇంకోటి కావచ్చు.. మిత్రులారా చెప్పండి.. తెలంగాణలో తెలంగాణా విమోచన దినోత్సవం చేయాల వద్ద.. నేను తెలంగాణ ప్రజలు కు చెప్తున్న., ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎసే.. అది రద్దు చేసి ఎస్సి, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ తెస్తము. తెలంగాణ అభివృద్ధి ఒక బిజెపి తో మాత్రమే సాధ్యం. మెదక్ లో బీజేపీ పువ్వు వికసింపచేయాలంటూ.. రఘునందన్ ను మీరు గెలిపించలని ఆయన కోరారు.