TS POLYCET: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 86.63 శాతం సత్తా చాటిన బాలికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS POLYCET: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లోని తిక్షా భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 85.73 శాతం, ఎంబీఐపీసీ స్ట్రీమ్‌లో 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు తమ సత్తా చాటారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 78.61 శాతం, బైపీసీ స్ట్రీమ్‌లో 78.62 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఈ నెల 17న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 98,274 మంది హాజరయ్యారు. వారిలో 54,700 మంది బాలురు, 43,574 మంది బాలికలు ఉన్నారు. ఎంపీసీ విభాగంలో 43,001 మంది బాలురు, 3,357 మంది బాలికలు అర్హత సాధించగా, బైపీసీ విభాగంలో 43,006 మంది బాలురు, 37,746 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు, అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 17న నిర్వహించబడింది. మే 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా 98,273 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అలాగే TS POLYCET ఫలితాలు 2023 మే 26న విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.
Karnataka: అమ్మాయి, అబ్బాయి కలిసి తింటే అంతలా కొట్టాలా ?
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!