హైదరాబాద్లో పార్టీ శ్రేణులతో అమిత్ షా బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే.. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమైన అమిత్ షా.. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా చార్మినార్ కు రానున్నారు.
Rashmika Mandanna : రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..
కాసేపట్లో చార్మినార్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. విజయ సంకల్ప సమ్మేళనం సభ అనంతరం చార్మినార్ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకుని .. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా.. టెంపుల్ దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. CAA అమలు తరువాత తొలిసారి ఓల్డ్ సిటీకి వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు.