Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని గుజరాత్‌కు బయలుదేరబోతుండగా శనివారం ఆయన ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలో సాంకేతిక లోపం గురించి సమాచారం అందిన వెంటనే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తన విమానాన్ని హోంమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు అందించారని సమాచారం. అనంతరం షా తన కుటుంబంతో కలిసి షిండే విమానంలో గుజరాత్‌కు బయలుదేరారు.
READ ALSO: Mirai : మిరాయ్ అంటే అర్థం తెలుసా.. అసలు కథ ఇదే
మహారాష్ట్ర సీఎం ఇంటికి కేంద్ర మంత్రి..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి మహారాష్ట్రకు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆయన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అతుల్ లిమాయే, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్, నూతనంగా నియమితులైన ముంబై బీజేపీ చీఫ్ అమిత్ సతంతో చర్చలు జరిపారు. అనంతరం హోంమంత్రి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వారి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజ గణపతిని సందర్శించుకున్నారు.
వినోద్ తావ్డే – షాల సమావేశం..
అమిత్ షా రెండు రోజుల ముంబై పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే ఆయన సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి సమావేశంలో రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమం గురించి అమిత్ షా ముఖ్యమంత్రి ఫడ్నవీస్, మంత్రి ఆశిష్ షెలార్ నుంచి సమాచారం తీసుకున్నారని వినికిడి.
READ ALSO: Jimmy Gaminlune Mate: సహాయక చర్యల్లో ప్రాణాలు వదలిన అగ్నివీరుడు..