Jimmy Gaminlune Mate: సహాయక చర్యల్లో పాల్గొని ఓ అగ్నివీరుడు ప్రాణాలు వదలిన ఘటన జమ్మూ డివిజన్‌లోని అఖ్నూర్ జిల్లాలో ఆగస్టు 26న చోటుచేసుకుంది. ఈసందర్భంగా శనివారం ఆ అగ్నివీరుడి మృతదేహాన్ని సైనిక లాంఛనాలతో వారి స్వగ్రామానికి పంపించారు. అమరవీరుడైన సైనికుడు మణిపూర్‌కు చెందిన జిమ్మీ గమిన్‌లున్ మేట్ అని తెలిపారు. ఈ వీర సైనికుడు ఆగస్టు 26న అఖ్నూర్‌లో వరదల సమయంలో, చీనాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో సహాయక చర్యల్లో పాల్గొని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
READ ALSO: Mehul choksi: మళ్లీ రిజెక్టైన మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్
దేశాన్ని రక్షించడానికి పర్గల్‌లో మరో ధైర్యవంతుడైన అగ్నివీరుడు ప్రాణాలను వదిలాడని ఆర్మీ అధికారులు తెలిపారు. అంతకుముందు BSF 195 బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజిబ్ నునియా కూడా మరణించారు. తాజాగా మరణించిన అగ్నివీరుడు జిమ్మీ గామిన్‌లున్ మేట్ అస్సాంలోని సిల్చార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదే సమయంలో జమ్మూలోని రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ముగ్గురు మరణించారు. రియాసి జిల్లాలోని మహోర్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. సోమవారం నుంచి వరదలు, వర్షం, క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటివరకు 54 మంది మరణించారు.
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
జమ్మూ డివిజన్‌లోని అన్ని నదుల నీటి మట్టం ప్రస్తుతం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా సంభవించిన వరదల వల్ల ప్రజలకు సహాయం చేయడానికి సైన్యం, వైమానిక దళం, NDRF, SDRF, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు, ఇతర సంస్థల సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాయి. సెప్టెంబర్ 5 వరకు వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఉధంపూర్‌లోని జఖేని, చెనాని మధ్య అనేక కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వరుసగా నాలుగో రోజు మూసివేసి ఉంది. జమ్మూ డివిజన్‌లో రైలు రాకపోకలు నిలిపివేశారు. ఉత్తర రైల్వే జమ్మూకు తిరిగి రావడానికి షెడ్యూల్ చేసిన 40 రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరో 12 రైళ్లను మధ్యలో నిలిపివేసింది.
READ ALSO: Modi Xi Jinping Meeting: రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని