వేసవి తరువాత కృష్ణానది నుంచీ నీటిని విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు. ప్రకాశం బ్యారేజీ ఈస్ట్రన్ హెడ్ రెగ్యలేటర్ నుంచీ కాలువలకు నీటి విడుదల చేశారు. పంట పొలాలు, త్రాగునీటి అవసరాలకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసామని, సీఎం జగన్ ఆదేశాలతో ఒక నెల ముందుగా పంట భూములకు నీటిని విడుదల చేసామన్నారు మంత్రి అంబటి.
Also Read : South Central Railway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు
ఖరీఫ్ ముందుగా ప్రారంభం కావడం వలన నీటి అవసరాలుంటాయని, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల వద్ద కావలసినంత నీరు ఉందని ఆయన అన్నారు. త్వరగా నారుమళ్ళు, పంటలు వేసుకోవాలని రైతులను కోరుతున్నామని, పట్టిసీమ నుంచీ నీరు తీసుకోవల్సిన అవసరం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. 34 టీఎంసీలు పులిచింతల స్టోరేజీ ఉందని, వరదలు వచ్చినపుడు తట్టుకోవడానికి విజయవాడలో రీటైనింగ్ వాల్ పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వరదలు వచ్చినపుడు తట్టుకోవడానికి సన్నద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.
Also Read : Top Headlines @1PM : టాప్ న్యూస్