రష్యా-చైనా ఉపగ్రహాలపై అమెరికా స్పై శాటిలైట్ ఫోకస్..
చైనా-రష్యా అంతరిక్ష వాహనాలను ట్రాక్ చేయడానికి యూఎస్ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాల సమూహాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది కక్ష్యలో ఉన్న వస్తువులను నిలిపివేయవచ్చు లేదా పాడు చేసే శక్తి దీనికి ఉంది. దీంతో అగ్రదేశాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రయోగం చేసేందుకు రెడీ అవుతుంది. అయితే సైలెంట్ బార్కర్ గా పిలువబడే ఈ నెట్‌వర్క్ భూ-ఆధారిత సెన్సార్లు తక్కువ ఎత్తులో భూమికి దగ్గరగా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఉపగ్రహాలు భూమికి దాదాపు 22,000 మైళ్లు (35,400 కిలోమీటర్లు) పైకి పంపించనున్నారు. అదే వేగంతో అది కక్షలో తిరుగనుంది. దీనిని జియోసింక్రోనస్ ఆర్బిట్ అని అంటారు.
జేఈఈ స్మార్ట్ కాపీయింగ్ కేసు.. సంస్థ నిర్లక్ష్యంపై పోలీసులు సీరియస్
జేఈఈ మెయిన్స్ స్మార్ట్ కాపీయింగ్ కేసులో కీలక పరిణాలు చోటుచేసుకున్నాయి. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన ఓ టాపర్ విద్యార్థి తన స్నేహితుల కోసం స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సమాధానాలను ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్లు గుర్తించారు. స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లను లోదుస్తుల్లో దాచుకుని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించినట్లు నిర్ధారణ అయింది. స్మార్ట్ ఫోన్లను లోదుస్తుల్లో దాచుకుని తనిఖీలు చేయించుకోకుండా అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఎగ్జామ్ హాల్ లో ప్రవేశించినట్లు విచారణలో తేలింది. జేఈఈ పరీక్ష నిర్వహణలో ప్రైవేటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టారు. కంపెనీ నిర్లక్ష్యాన్ని కూడా సీరియస్ గా తీసుకున్న పోలీసులు పరీక్షా కేంద్రానికి స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లకపోవడానికి ఎవరు కారణం అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
మనం చాలా మంది దొంగలను చూసే ఉంటాము.. దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు.. వారిని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని ముఖానికి మాస్క్ ధరిస్తూ ఉంటారు.. లేదంటే ఏదైనా నలుపు రంగు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. అలా ఏదో ఒక రకంగా తమ ముఖాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా ఓ దొంగ సెల్ ఫోన్ లో చోరీ చేయడానికి వచ్చాడు. ఆయన అక్కడకు వచ్చాక సీసీ కెమెరాలు ఉంటాయని గుర్తుకు వచ్చింది. దీంతో తన ముఖం కనపడిపోతుందని.. అందుకే తన ముఖాన్ని కవర్ చేయడం కోసం ఆయన చేసిన పని ఇప్పుడు అందరినీ తెగ నవ్వి్స్తుంది.
ఇంతకీ అతను ఏం చేశాడో మీకు తెలుసా..? ఓ అట్టపెట్టను ముఖానికి కవర్ చేసుకొని వచ్చి దొంగతనం చేశాడు. కానీ సెల్ ఫోన్ లు కొట్టేస్తున్న ఆనందంలో ఆ అట్టపెట్ట తన ముఖం నుంచి తొలగిపోయిందనే మాత్రం గమనించలేదు.. ఇంకేముంది.. సీసీ కెమెరాలలో దొంగ ముఖం కనిపించడంతో పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.
GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్
ఎమ్మెల్యే ల ఎర కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల అయిన నందకుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన జీహెచ్ ఎంసీ కమిషనర్, మరో ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును విధించింది. దీంతో.. హైకోర్ట్ లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ను నందకుమార్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి తన పొజిషన్ లో వున్న బిల్డింగ్ ను కూల్చేశారు అంటూ నందకుమార్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. GHMC కమిషనర్ లోకేష్ కుమార్, జూబ్లీహిల్స్ జోనల్ కమిషనర్ రవితేజ, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ లపై చర్యలు తీసుకోవాలని నందకుమార్ హైకోర్ట్ ను కోరారు. గత ఏడాది నవంబర్ 11న రిట్ పిటిషన్ 18529/ 2021, మరో రిట్ పిటిషన్ 18645/2021 లో.. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్
హైదరాబాద్‌లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తూ ఓ ముఠా పట్టుబడగా.. ఇప్పుడు కేకులు, స్వీట్లు తయారు చేస్తూ పట్టుబడుతుండడంతో.. ఏం తినాలన్నా భయపడుతున్నారు. నగరంలో కల్తీ పదార్థాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల నకిలీ నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కల్తీ కేక్‌లు తయారు చేస్తున్న ముఠాపై ఎస్‌వోటీ బాలానగర్ పోలీసులు దాడి చేశారు. బాచుపల్లి పరిధిలోని నిజాంపేటలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేకులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేశారు. కేకుల తయారీలో రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. యజమాని గోపాల కృష్ణ పరారీలో ఉండగా, అక్కడ పనిచేస్తున్న సయ్యద్ వాసిఫ్‌తో పాటు కేక్ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్‌కర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా పలు సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్నారు. విద్యార్థులతోపాటు ఇతరులతోనూ సమావేశం అవుతున్నారు. రాహుల్ గాంధీ అమెరికాలో చేస్తున్న వ్యాఖ్యలను ఇండియాలోని బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భారత ఉపరాష్ట్రపతే నర్మగర్భంగా స్పందించారు. కొందరు దేశం యొక్క ఎదుగుదలను చూడలేరని.. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలుస్తుందని చెప్పారు.
దేశంలోని సంస్థలను కళంకం, ధ్వంసం చేసేవారిని వెనుక అద్దంలో చూసుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికాలో జరిగిన ఒక మీటింగ్‌లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మంగళవారం స్పందించారు. మనలో కొందరు గర్వించరు… ఈ దేశం యొక్క సంభావ్య మరియు నిజసమయ విజయాల గురించి ఒప్పుకోలేక తప్పుదారి పట్టించే ఆత్మలు గందరగోళంలో ఉన్నాయన్నారు. తన అధికారిక నివాసంలో ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారుల బ్యాచ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశం లోపల మరియు వెలుపల కొంతమంది మమ్మల్ని క్రమాంకనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఉపరాష్ట్రపతి అన్నారు.
ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల సమీపంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సేవాలాల్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 8 నెలల గర్భిణి.. అయితే ఆమెకు ఈ నెల 27న ప్రసవం కావాల్సి ఉంది. ఆమె మృతికి పోలీసులే బాధ్యత వహించాలని మృతురాలి బంధవులు ఆరోపించారు.
మాసబ్ ట్యాంక్ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఎన్ ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడటంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలచిపోయింది. ఆయిల్ ట్యాంకర్ పడిపోవడంతో ఇరువైపుల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి వాహనాలు. రోడ్డుపై ఆయిల్ మొత్తాన్ని తొలగించారు అధికారులు.
అయితే.. మాసబ్‌ట్యాంక్, మోహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్, బంజారాహిల్స్ రోడ్‌నెం.1, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ నుంచి కిందికి ఆయిల్ కారుతుండటంతో.. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్
కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య గమ్యస్థానాలకు చేరుకోవడానికి రెండు సెమీ హైస్పీడ్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. మొదటి రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రారంభం కాగా, రెండో రైలు సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తోంది. ఈ రెండు రైళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ కు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేటాయించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు నడిపేందుకు కృషి చేస్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య సాధారణ ట్రాఫిక్ ఉంటుంది.