Kangana Ranaut: చంద్రముఖిగా కాంట్రవర్సీక్వీన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇప్పుడు నటుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు. చంద్రముఖి దర్శకుడు పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read
ఇందులో చంద్రముఖిగా కంగనా కనిపించనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో కాంట్రవర్సీ క్విన్ కంగనా నటించనుందని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కంగనా పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే చంద్రముఖి-2లో లక్ష్మీ మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. హారర్ జోనర్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చంద్రముఖికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి భాగం చంద్రముఖిలో కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు ఈసీక్వెల్‌లో కూడా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సినిమా డిజైనర్ అయిన నీతా లుల్లా కూడా కంగనా లుక్ గురించి మాట్లాడుతూ, “కంగానా ప్రతిరూపమైన పాత్రను సృష్టించడానికి, ఆమె లుక్స్, ఆమె జుట్టు, ఆమె వైఖరి, నడకలో డ్యాన్స్ స్ఫూర్తిని చిత్రీకరిస్తున్నామని. నాకు ఇప్పుడు కంగనా చంద్రముఖి. ఈ చిత్రం ఒక అందమైన, సవాలుతో కూడుకున్న అనుభవంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో కంగనా రనౌత్‌తో మళ్లీ కలిసి పనిచేయడానికి నేను చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే.. బాలీవుడ్‌లో అత్యధిక రేటింగ్ పొందిన నటీమణులలో ఒకరైన కంగనా తమిళ సినిమాకి కొత్త కాదు, ఎందుకంటే ఆమె ఇప్పటికే ‘ధామ్ ధూమ్’లో జయం రవికి జోడీగా నటించింది. ఇటీవల ఆమె దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత బయోపిక్‌లో విజయ్ దర్శకత్వం వహించిన ‘తలైవి’లో తన ప్రామాణికమైన పాత్ర ద్వారా విమర్శకులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరి చంద్రముఖితో ఎంతమందిని కంగనా ఆకట్టుకోనుంది అనే విషయమై 2023 వరకు వేచి చూడాల్సిందే..
కంగనా పోస్టర్‌లో క్లాసీ, డిజైనర్ లెహంగా ధరించి, పురాతన ఆభరణాలతో తన రూపాన్ని పెంచుకుంది. మేకర్స్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కంగనాను స్వాగతించారు “#చంద్రముఖి2 ప్రపంచంలోకి #కంగనారనౌత్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని తెలిపారు.
We are elated 😌✨ to welcome #KanganaRanaut into the world of #Chandramukhi2 🗝️@offl_Lawrence 😎 #PVasu 🎬 Vaigaipuyal #Vadivelu @realradikaa ✨ @mmkeeravaani 🎶 @RDRajasekar 🎥 #ThottaTharani 🎨 @proyuvraaj 🎙️ @gkmtamilkumaran 🫱🏼🫲🏻@LycaProductions #Subaskaran 🪙 pic.twitter.com/cmLp5ehJ7o
— Lyca Productions (@LycaProductions) December 10, 2022
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!