Allu Arjun: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, రేంజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఉత్తరాదిన ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఇదే బన్నీకి బాలీవుడ్ సినిమా ఆఫర్ తీసుకొచ్చింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తో తదుపరి చిత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
Read Also: Viral Video : టైపింగ్ లో అధికారి పొరపాటు.. కుక్కలా అరుస్తూ బాధితుడి నిరసన
బాలీవుడ్ లో ప్రస్తుతం భారీ యాక్షన్, హర్రర్, కామెడీ మూవీ గా తెరకెక్కిన బేదియని తెలుగులో తోడేలు పేరుతో నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేయనున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మడాక్ ఫిలిమ్స్, జియో స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. తోడేలు సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, మూవీని తెరకెక్కించడంలో టీమ్ పడిన కష్టం స్క్రీన్ పై కళ్లకు కట్టినట్లు కనపడుతుందన్నారు. కొన్ని కీలక సీన్స్ చూసినప్పుడు అద్భుతంగా అనిపించాయన్నారు. సినిమా కథ, కథనాలు బాగుంటే భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రాణించడం ఇటీవల రిలీజైన కొన్ని సినిమాల ద్వారా రుజువైందన్నారు.
Read Also: Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా పడిన ధర
మొత్తం ప్రపంచంలో పుష్ప సినిమా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. మొన్నటివరకూ ఎక్కడ చూసినా శ్రీవల్లి పాట స్టెప్పులే కన్పించాయి. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ తగ్గేదే లే మేనరిజమే వ్యాపించింది. అందుకే దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అనుకున్న సమయం కంటే ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అభిమానులు మాత్రం ఎప్పుుడా అని ఎదురుచూస్తున్నారు. బేదియా నిర్మాత దినేష్ విజన్ పుష్ప కంటే ముందు తనను కలిసినపుడు అల్లు అర్జున్ తో ఒక బాలీవుడ్ మూవీ తీసేందుకు సిద్ధం అయినట్లు తెలిపారని చెప్పాడు. ఆ విధంగా మా అందరికంటే ముందే బన్నీ పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారని ఆయన గుర్తించారన్నారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ తో ఆయన ఒక భారీ మూవీ తీయాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా తోడేలు మూవీ నవంబర్ 25 న పలు భాషల్లో రిలీజ్ కానుంది.