Viral Video : కొన్ని సార్లు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది. అధికారుల విషయంలో చిన్న పొరపాటే అయినా అది సామాన్యులకు పెద్ద సమస్యలను తెచ్చి పెడుతుంది. దీంతో వారి సమయం, డబ్బు వృథా అవుతోంది. ఇక్కడా అలాంటిదే జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి అధికారి ఎదుట వినూత్న నిరసన చేపట్టాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన గడప గడపకే ప్రభుత్వం కార్యక్రమంలో చోటు చేసుకుంది. అసలు విషయాన్ని కొస్తే.. రేషన్ కార్డులో తన ఇంటి పేరు దుత్తాకు బదులుగా ‘కుత్తా’ అని తప్పుగా నమోదు కావడంతో ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ ఉన్నతాధికారి ఎదుట నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘గడప వద్దకే ప్రభుత్వం’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హాజరయ్యారు. ఆయన కారు వద్దకు చేరుకున్న శ్రీకాంతి కుమార్ దుత్తా కుక్కలా అరుస్తూ కొన్ని పత్రాలు సమర్పించారు.
Read Also: Kantara 2 Update: కాంతార 2 అప్పుడే వచ్చేది.. అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
అసలు విషయం ఏంటంటే.. శ్రీకాంతి కుమార్ దుత్తా పేరును రేషన్ కార్డులో శ్రీకాంతి కుమార్ కుత్తాగా ముద్రించారు. హిందీలో కుత్తా అంటే కుక్క కావడంతో కార్డులో తప్పుగా ప్రింట్ అయిన తన పేరును మార్చాలని కుక్కలా అరుస్తూ అధికారికి అర్జీ పెట్టుకున్నాడు. తన పేరు ఇలా తప్పుగా ప్రింట్ కావడం ఇదే తొలిసారి కాదని ఈ సందర్భంగా శ్రీకాంతి కుమార్ పేర్కొన్నాడు. తొలిసారి అతడి పేరును శ్రీకాంత మొండల్ అని రాశారట. దీంతో తప్పును సరిచేయాలని అర్జీ పెట్టుకుంటే దానిని శ్రీశాంతో దుత్తాగా మార్చారు. ఆ తర్వాత మరోసారి శ్రీకాంత్ కుమార్ కుత్తా అని మార్చారు. దీంతో విసిగిపోయిన ఆయన ఇక లాభం లేదని ఇలా వినూత్నంగా నిరసన తెలిపి తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
भाई का सरनेम “दत्ता” था मगर राशन कार्ड में गलती से “कुत्ता” लिखा गया! अब भाई लिखे हुए सरनेम के अनुसार अधिकारी से बात कर रहा है! 😂😂
— Prashant Kumar (@scribe_prashant) November 19, 2022