NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు..
- విలీనం దిశగా ఎన్సీపీ వర్గాలు..
- విలీనం తర్వాత ఎన్డీయే కూటమిలోకి శరద్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ వర్గం, సునేత్రా పవార్ ఎన్సీపీ వర్గం కలిసిపోయే అవకావాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు వర్గాల విలీనం కావాలని బీజేపీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరవెనర బీజేపీ వేగంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ వర్గాన్ని ప్రత్యేక పార్టీగా గుర్తించి ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం బీజేపీకి ఇష్టం లేదని సమాచారం. దీని వల్లే ముందు రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోవాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాన్ని బీజేపీలో విలీనం చేసుకునే ఆలోచన లేదని సమాచారం.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ, శివసేన పార్టీల చీలిక తర్వాత బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీని ఎన్డీయేలో చేర్చుకుంటే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని దెబ్బతీసినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే సమయంలో రెండు ఎన్సీపీ వర్గాలు కలిస్తే రెండు వర్గాలకు ఒక్కో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడాన్ని కమలం పార్టీ పరిశీలిస్తోంది.
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
ఇదిలా ఉంటే, ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ‘‘డీలిమిటేషన్ బిల్లు’’ కోసం కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ఆ సంఖ్యా బలం కోసం వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శరద్ పవార్ ఎన్సీపీకి 8 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. ఈ మద్దతు ఎన్డీయే కూటమికి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు బీజేపీకి బిల్లు విషయంలో మద్దతు ఇస్తామంటూ సుప్రియా సూలే హింట్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెరిగితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శరద్ పవార్ కుమార్తె చెప్పడం గమనార్హం.
మరోవైపు, మహారాష్ట్రలో రహస్య భేటీలు జరుగుతున్నాయి. శరద్ పవార్ ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు. ఎన్సీపీ రెండు వర్గాల నేతలు కూడా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ కూడా ఫడ్నవీస్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో నాయకత్వ పోటీ పెరిగింది.
తాజావార్తలు
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?