Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో పప్పు, కూరలు, పచ్చళ్లు, చట్నీలు వంటి అనేక వంటకాలలో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇది వంటకాలకు ప్రత్యేక రుచి అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో అలిసిన్, విటమిన్ B6, విటమిన్ C, మాంగనీస్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించే ముందు దాని తొక్క తీయడం చాలామందికి తలనొప్పిగా మారుతుంది. పలుచని పొర ఉండటంతో తొక్క అంత సులభంగా రాక చాలా మంది అవస్థ పడుతుంటారు. ముఖ్యంగా ఒకేసారి ఎక్కువ వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయాల్సి వస్తే అప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కొన్ని సులభమైన కిచెన్ టిఫ్స్తో ఈ పనిని కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చని మీకు తెలుసా.. ఇంతకీ ఆ టిఫ్స్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
వెల్లుల్లి తొక్క సులభంగా తీసే చిట్కాలు
* వెల్లుల్లి రెబ్బలను ఒక స్టీల్ లేదా గాజు గిన్నెలో వేసి, మరో గిన్నెతో మూతపెట్టి 20 నుంచి 30 సెకన్ల పాటు బాగా షేక్ చేయాలి. దీంతో చాలా రెబ్బల తొక్కలు వాటంతట అవే వదులైపోతాయి.
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
* వెల్లుల్లి రెబ్బలను 5 నుంచి 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెడితే వాటి తొక్కలు చాలా సులభంగా వస్తాయి.
* ఒకేసారి ఎక్కువ వెల్లుల్లి శుభ్రం చేయాల్సి వస్తే మైక్రోవేవ్‌లో 10 నుంచి 15 సెకన్ల పాటు కొద్దిగా వేడి చేసి తీస్తే చాలా సింపుల్‌గా వాటి పొట్టు వస్తుంది. అయితే ఎక్కువసేపు వేడి చేస్తే వెల్లుల్లి రుచి మారే అవకాశం ఉంది.
వెల్లుల్లి తొక్క తీసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
* ఎప్పుడూ గట్టిగా, నాణ్యమైన వెల్లుల్లి రెబ్బలను మాత్రమే ఉపయోగించాలి.
* మెత్తబడిన లేదా పాడైన వెల్లుల్లి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
* వెల్లుల్లిని నీటిలో నానబెట్టినా ఎక్కువసేపు ఉంచకూడదు.
* కత్తితో వెల్లుల్లి తొక్క తీసేటప్పుడు చేతికి గాయాలు కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
* అవసరమైనంత మేరకే వెల్లుల్లి తొక్క తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువసేపు తొక్క తీసిన వెల్లుల్లి ఉంచితే దాని తాజాదనం తగ్గిపోతుంది.
ఎక్కువ రోజులు తాజాగా నిల్వ చేయాలంటే..
వెల్లుల్లిని ఎప్పుడూ చల్లని, పొడి, గాలి బాగా ఆడే ప్రదేశంలో నిల్వ చేయాలి. ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే తేమ పెరిగి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జాలి బుట్ట, పేపర్ బ్యాగ్ లేదా గాలి చొరబడే పాత్రలో నిల్వ చేయడం ఉత్తమం. ఇప్పటికే తొక్క తీసిన వెల్లుల్లిని ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే కొద్ది రోజుల పాటు తాజాగా ఉంటుంది.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు