అలియా భట్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ.అలియా భట్‌కు బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది ఈ భామఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా సీత పాత్రలో బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో మరో విజయం అందుకుంది. ఆ తరువాత రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. అలాగే పెళ్లి అయిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సి రావడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉందీ ఈ బ్యూటీ. ఈ దంపతులకు ఒక పాప పుట్టింది.పాప పుట్టిన కొంత కాలం తర్వాత అలియా మళ్ళీ సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.. రణ్వీర్ సింగ్ సరసన అలియా నటించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రం జూలై 28న విడుదల కాబోతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మరియు పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అలాగే ఆమె నటించిన హాలీవుడ్ హార్ట్ అఫ్ స్టోన్ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా విడుదల కాబోతుంది.ఇందులో అలియా తొలిసారి విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్ 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది . తాజాగా అలియా భట్ ముంభైలోని ఓ ఏరియాకు వచ్చింది. అక్కడ ఆమెను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఎంతో ఉత్సాహం చూపించారు. అయితే అలియా వారికి ఆ ఫొటోస్ కు కొన్ని పోజులు కూడా ఇచ్చింది.ఈ క్రమంలో ఫోటోస్ తీసే కంగారులో ఓ ఫోటోగ్రాఫర్ చెప్పు కాలు నుంచి విడిపోయి ఆమె పక్కన పడింది. ఇది గమనించిన అలియా.. ఆ చెప్పు ఎవరిది అంటూ అడుగుతూ.. తన చేతితో పట్టుకుని మరీ ఆ వ్యక్తికి ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది… అలియా చేసిన పనికి నెటిజన్స్ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు