Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి వేంకటేశ్వరస్వామి భక్తులకు అలెర్ట్.. ఎందుకంటే.. వివిధ రకాల సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎప్పుడైనా ఏ టికెట్లను విడుదల చేసినా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే భక్తులు టికెట్లను బుక్‌చేసుకుంటున్న విషయం విదితమే కాగా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవా టికెట్లతో పాటు వర్చువల్ సేవా టికెట్లు, పవిత్రోత్సవాల టికెట్లు, అంగప్రదక్షణం టికెట్లు.. ఇలా విడివిడిగా ఆన్‌లైన్‌లో ఉంచనుంది టీటీడీ..
Read Also: Home Loans: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తున్న 10 బ్యాంకులు..
ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవా టికెట్లను లక్కీడిఫ్ కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ.. ఈ నెల 19వ తేదీన సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లను అమ్మకానికి పెట్టనున్నారు. ఇక, 22వ తేదీ ఉదయం 10 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. 22వ తేదీన పవిత్రోత్సవాల సేవా టిక్కేట్లు విడుదల కానుండగా.. 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది. మరోవైపు ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 72,299 మంది భక్తులు దర్శించుకున్నారు.. వారిలో 36,378 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ. 3.92 కోట్లుగా ఉంది..