Sending Under 3 Years Old Students To Pre School is Illegal: ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ పిల్లలు పుట్టడంతోనే అన్నీ నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. దాని కోసం వారి పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ల లోపే వారిని ప్రీ స్కూల్ అంటూ జాయిన్ చేస్తున్నారు. దీంతో కొంత మంది పిల్లలు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లనని ఏడుస్తున్న కొట్టో, తిట్టో బలవంతంగా వారిని స్కూల్ కు పంపిస్తున్నారు. పై చదువులలో స్టాండర్డ్ బాగుండాలంటే ప్రీ స్కూల్ నుంచే మంచిగా చదవాలని వారిపై ప్రజెర్ పెంచుతున్నారు. అంతక ముందు 5 ఏళ్ల వయసు దాటితేనే స్కూల్ లో వేసే వారు. కానీ ఇప్పుడు మరీ 3 సంత్సరాలకే బడులకు పంపితే వారు తల్లి దండ్రులను మిస్ అవుతున్నారు. ఆడుకునే వయసులో వారి సమయాన్ని స్కూల్ లోనే గడపుతున్నారు. తల్లిదండ్రులు ఇలా చేస్తూ ఉండంతో ప్రభుత్వమే చిన్నారులకు అండగా నిలిచింది.
Also Read: AI Tools: అమెరికా కాలేజీలు, వర్సిటీలకు సమస్యగా మారిన ఏఐ టూల్స్.. విద్యార్థులు ఏం చేస్తున్నారంటే
మొదటి తరగతి అడ్మిషన్‌కు పిల్లల కనీస వయసు ఆరేండ్లుగా పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీచేసింది. ఇది కొంతమంది తల్లిదండ్రులకు నచ్చక ఈ విషయంపై వారు కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును గుజరాత్ హైకోర్టు తీర్పును వెలువరించింది. మూడేండ్ల లోపు తమ పిల్లల్ని బలవంతంగా ప్రీస్కూల్స్‌కు పంపితే అది నేరపూరిత చర్య కిందకే వస్తుందని వెల్లడించింది. ఇక ఈ విషయానికి సంబంధించి స్కూల్స్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 1వ తేదీ నాటికి మూడేండ్లు దాటని పిల్లల్ని ప్రీస్కూల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోవద్దని ఆదేశించి గుజరాత్ హైకోర్టు. ఈ తీర్పును కొంత మంది తల్లిదండ్రలు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుందని కూడా నిపుణులు తెలుపుతున్నారు.