AI Tools: అమెరికా కాలేజీలు, వర్సిటీలకు సమస్యగా మారిన ఏఐ టూల్స్.. విద్యార్థులు ఏం చేస్తున్నారంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Using AI Tools: మొన్నటి వరకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ పై ఏది కావాలన్నా ఆధారపడే వాళ్లం. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ హవా నడుస్తుంది. ఎక్కడ చూసిన చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించే వినిపిస్తుంది. అయితే ఇవే ఇప్పుడు విద్యాసంస్థలకు తల నొప్పిగా మారాయి. విద్యార్థులు ఈ ఏఐ టూల్స్ ను ఉపయోగించి తమ పనులను చకచక చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థుల సృజనాత్మకత దెబ్బతింటుందని కాలేజీలు, యూనివర్శిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక తాజాగా అమెరికాలోని కొన్ని కాలేజీలకు ఈ టూల్స్ మరీ తలనొప్పిగా మారాయి. యూఎస్ లో కొన్ని కాలేజీలలో, యూనివర్శిటీలలో విద్యార్థులు చేరాలంటే వారి హిస్టరీ మొత్తం ఒక వ్యాసం రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే వారికి అడ్మిషన్లు ఇస్తారు. ఇందులో విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ ను కూడా ఆయా విద్యాసంస్థలు చెక్ చేస్తాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే చాలా మంది విద్యార్థులు చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ ను ఉపయోగించి ఈ పనిని సులువుగా చేసేస్తున్నారు. ఎవరి వ్యాసం చూసిన అద్భుతంగా అనిపిస్తుంది. దీంతో ఎవరికి అడ్మిషన్ ఇవ్వాలో తెలియక విద్యా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే కొన్ని యూనివర్శిటీలు ఈ ఆర్టిఫిషియల్ టూల్స్ పై నిషేధం విధించాయి. కొన్ని యూనివర్శిటీలు వీటిని పాక్షికంగా ఉపయోగించవచ్చని తెలిపాయి. ఇదిలా వుండగా మిచిగాన్ యూనివర్సిటీ అయితే వీటి వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ఏఐ టూల్స్ అందుబాటులోకి రాగానే ప్రారంభంలోనే విద్యాసంస్థలు స్టూడెంట్స్ భవితవ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి వాడటానికి ఎంతో సులభంగా ఉండటంతో పాటు సమాచారం కూడా కావాల్సిన విధంగా రావడంతో మెదళ్లకు పని చెప్పడం మానేస్తారని అనుమానం వ్యక్తం చేశాయి. తాజాగా ఇది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!