నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’పై అభిమానుల్లో హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఓ రేంజ్ అంచనాలే ఉంటాయి మరి . సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన అఫీషియల్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ట్రైలర్‌కి కొన్ని ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్.. బాలయ్య లుక్ చూస్తుంటే బోయపాటి మరోసారి కొన్ని మాస్ ఎలిమెంట్స్ తో దుమ్ము లేపే సీన్స్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలా మొత్తని ట్రైలర్ 24 గంటల్లో ఓవరాల్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ను ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఏపీలో అయితే ప్రీమియర్ షోల విషయంలో పెద్ద ఇబ్బంది లేకపోయినా, టికెట్ ధరలపై డిస్ట్రిబ్యూటర్లు లోలోపల చర్చిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే, ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు పై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సినిమాకు రైట్స్ కూడా ఆయనే తీసుకోవడం వల్ల, ప్రీమియర్ల ప్లానింగ్ సులభంగా సెట్ అవుతుందని అంటున్నారు సినీ వర్గాలు. ప్రీమియర్స్ నుంచే బాలయ్య తాండవం మొదలవుతుందనే బలమైన నమ్మకం అభిమానుల్లో ఉంది.