Akhanda 2 Release Date: ‘అఖండ 2’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. తదుపరి తేదీ గురించి అభిమానులు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. విడుదల తేదీపై తాజాగా కీలక ప్రకటన వెలువడింది. రేపటికి (బుధవారం) కోర్టు ఆర్డర్ మేకర్స్ చేతికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే.. ఇప్పటికే అభిమానులు ఆగ్రహానికి గురవుతున్న వేళ.. సినిమాను అతి త్వరలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. వచ్చే వారం అఖండ 2 ను తెరపై తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈనెల 12న సినిమా థియేటర్లలో సందడి చేయనుందనే సమాచారం సైతం అందుతోంది. అయితే.. ఈ రెండ్రోజుల్లో 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ రిలీజ్ తేదీపై అధికారి ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది!
READ MORE: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.6 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
అఖండ 2 వాయిదాకు కారణాలేంటి..?
అఖండ 2 సినిమా వాయిదా పడటానికి అసలు కారణం సంకేతిక సమస్యలు కాదు. ఈ చిత్ర నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంట గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 1నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తో బాగస్వామ్యంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. కానీ రెండు సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అయ్యాయి. అప్పటి నుంచి 14 రీల్స్ కు ఈరోస్ నౌ మధ్య ఆర్థిక లావాదేవిలా విషయంలో ఇష్యూ నడుస్తోంది. ఈరోస్ కు రూ. 27. 8 కోట్ల రూపాయలు 14 రీల్స్ బకాయి ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించకుండా 14 రీల్స్ ప్లస్ అని మరొక బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు రామ్ ఆచంట, గోపి ఆచంట. కొన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఈరోస్ ఇప్పడు అదును చూసి 14 రీల్స్ మేకర్స్ పై మద్రాసు కోర్టులో కేసు వేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఈరోస్ కు అనుకూలంగా రావడంతో అఖండ 2 రిలీజ్ ఆగింది.