బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగు ఆడియన్స్‌కి ఒక ప్రత్యేక క్రేజ్. ఈ కాంబోలో వచ్చిన “అఖండ” ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయి హైప్‌తో “అఖండ 2 తాండవం” డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగం ఓటిటీలో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది కాబట్టి, రెండో భాగాన్ని కూడా దేశవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై మరో ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఇది ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా చేయని పెద్ద ప్రయత్నం అని చెప్పాలి.
Also Read : Ravi Babu: టాలీవుడ్‌కు ‘అతి’నే కావాలి..
ఏంటంటే “అఖండ 2” ని నార్త్ భారతదేశంలో మాట్లాడే అవాధీ భాషలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. అవాధీ అనేది ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే భాష. ఈ ప్రాంతాల్లో మాస్ యాక్షన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిన మేకర్స్, బాలయ్య విజృంభణను అక్కడి ఆడియన్స్‌కీ చేరేలా ఇలా చేయాలని నిర్ణయించుకున్నారట. అవాధీ భాషలో ఈ సినిమా రిలీజ్ అయితే, అది నిజంగా తెలుగు ఇండస్ట్రీకి కొత్త రికార్డ్. ఇంతవరకు మా చిత్రాలకు హిందీ డబ్ వెర్షన్లు ఉండటం కామన్, కానీ అవాధీ లాంటిది అయితే ఫస్ట్ టైమ్. అక్కడి లోకల్ డైలెక్ట్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే చాలా బాగా కనెక్ట్ అవుతాయని బిజినెస్ అనలిస్ట్‌లు కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి, “అఖండ 2 తాండవం” ఇప్పటికే భారీ హైప్‌తో ఉంది. పైగా అవాధీ విషయం నిజమైతే, బాలయ్య సినిమా రేంజ్ పాన్ ఇండియాను దాటి మరో లెవెల్‌కి వెళ్లే అవకాశం ఉంది.