నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘అఖండ’కు కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్, మునుపటి భాగం క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని మేకర్స్ ప్రకటించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, బోయపాటి మార్క్ మాస్ ట్రీట్‌తో థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతున్నాయి . ప్రస్తుతం ఈ సినిమా అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాబ్ షేక్, సరైన, థియామ్ 3 నిర్మించగా, ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.