నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ, ఆ అనూహ్య పరిణామం సినిమాపై హైప్‌ను మరింత పెంచేసిందనే చెప్పాలి. విదేశాల్లో, ముఖ్యంగా USA లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.…