జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాను అజయ్ సామ్రాట్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా లో మమత మోహన్ దాస్, విమల రామన్ మరియు గానవి లక్ష్మణ్ నటించారు.ఈనెల 7 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అజయ్ సామ్రాట్ మీడియాతో సినిమా గురించి మాట్లాడుతూ నా చిన్న తనం లో విన్న కథలు అలాగే నేను చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ఈ కథను రాసుకున్నాను.ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది.. ఇందులో నేను చూపించిన సమస్యలు ఎక్కడ ఉంటే, అక్కడి నుంచి ఈ కథను తీసుకున్నట్లు అవుతుంది.ఈ సినిమాలో చూపించిన ప్రజా సమస్యలు ఎక్కడ వచ్చినా ఇలాంటి పోరాటాలే జరుగుతాయి. దొరల అణిచివేతల మీద ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ రుద్రంగి సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది..ఈ సినిమాకు విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. కారెక్టర్ మూడ్, లైటింగ్, డైలాగ్ మూడ్ మరియు టోన్ మూడ్ ఇలా ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.
జగపతి బాబు గారికి కథ చెబితే చాలా బాగుందని సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.ఆయన ఆ పాత్రలో జీవించారని చెప్పవచ్చు.రోజూ పన్నెండు గంటలకు షూటింగ్ ఉంటే ఆయన ఉదయం ఎనిమిది గంటలకే వచ్చి సెట్లో ఉండేవారు. ఆయన నేను చెప్పిన కథను బాగా నమ్మారు.అలాగే హీరోయిన్ మమతా దాస్ గారిని కలిసి ఈ సినిమా కథ చెప్పాను. ‘యమదొంగ’ సినిమాలో మమతా మోహన్ దాస్ గారి నటనంటే నాకు చాలా ఇష్టం. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’ సినిమాలో నటించమని కోరాను.ఆమె వెంటనే ఒప్పుకున్నారు.నిర్మాత రసమయి గారికి సినిమా అద్భుతముగా తీయాలనే తపన ఉంది.నిర్మాతగా ఆయన కావాల్సిన దానికంటే ఎక్కువగానే సమాకూర్చారు.. నేను ‘బాహుబలి, రాజన్న సినిమాలకు డైలాగ్ రైటర్గా పని చేశాను. రాజమౌళి గారితో నాకు ఎంతో పరిచయం ఉంది. నా దగ్గర ఇంకా కొన్ని కథలున్నాయి. ఈ సినిమా తరువాత వాటిని తెరకెక్కిస్తాను. మైత్రి మూవీస్ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్ముతున్నాను అని ఆయన తెలిపారు.