NTV Telugu Site icon

Hyderabad: పారిశ్రామికం నుంచి వ్యవసాయం వరకు.. రాజధానిలో ఎటు చూసినా ఏఐ..!

Artificial Intelligence

Artificial Intelligence

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకువస్తోంది. ఇది స్వయంప్రతిపత్త వాహనాల నుంచి వర్చువల్ అసిస్టెంట్ల వరకు ప్రతిదానిలో ఉంటుంది. ఏఐ యొక్క శక్తితో, వ్యాపారాలలో ప్రక్రియలు స్వయంచాలకంగా మారుతున్నాయి. అనుభవాలు మెరుగుపరచబడుతున్నాయి. దీనితో పాటు, పెద్ద డేటాసెట్ల నుంచి కొత్త అవకాశాలను కనుగొనడం కూడా సులభం అవుతుంది. కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘గ్లోబల్‌ ఎఐ సమ్మిట్‌–2024’ ఆ సమూల పరివర్తన సాధక సాంకేతికతలో అతినూతన పోకడలపై వెలుగులు ప్రసరించేందుకు సిద్ధమైంది. ఆరోగ్య భద్రత, జీవశాస్త్రాలు, విద్య, వ్యవసాయం, న్యాయవ్యవస్థ, తయారీ రంగం, పౌర సేవలు ఇత్యాది రంగాలలో ఏఐ ఆధారిత నవీకరణల ప్రగాఢ, విస్తార ప్రభావ ప్రాబల్యాలను అధ్యయనం చేసేందుకు ఈ సమ్మిట్ ఉపయోగకరంగా ఉంటుంది.

READ MORE: Vadodara floods: కుక్కను రక్షించిన స్థానికులు.. వీడియో వైరల్

హైదరాబాద్ ఏఐ ఎందుకు కీలకం?

గ్లోబల్‌ టెక్నాలజీ కేంద్రంగా మారనున్న హైదరాబాద్‌ ఏఐ ఆధారిత భవిష్యత్తు కల్పించే అవకాశాలను సమగ్రంగా ఉపయోగించుకునేందుకు సన్నద్ధమవుతోంది. జెనరేటివ్‌ ఏఐతో కలిసి ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తున్నాయి. సకల పారిశ్రామిక కార్యకలాపాలలోనూ ఏఐను ఉపయోగించుకోవడమనేది రాను రానూ పుంజుకుంటోంది. భారతదేశ సైబర్‌ సిటీగా ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్‌ ఏఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాల సర్వసన్నద్ధంగా ఉంది. నగరంలో సాటిలేని రీతిలో పెరుగుతూ.. ప్రభావదాయకంగా ఉన్న నవీన సాంకేతికతల వ్యవస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏఐ విప్లవ పురోగమనానికి సానుకూల పరిస్థితులను సమృద్ధంగా సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌ ఒక ఉన్నతస్థాయి విద్యాకేంద్రం. నగరంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏటా వేలాది ఇంజినీరింగ్‌ పట్టభద్రులను రూపొందిస్తున్నాయి. ఎఐ విప్లవాన్ని నగరంలోనే కాకుండా విశాల భారతదేశమంతటా ఎఐ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆ ప్రతిభావంతుల పాత్ర కీలకమైనది.

READ MORE:CM Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమ‌ణ‌లు తొల‌గిస్తాం…

రైతులకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు..

తెలంగాణలో సంప్రదాయక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు ఏఐని ఫలప్రదంగా వినియోగిస్తున్నారు. పంట సమాచారం, సాగు భూముల పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఏఐ, రైతులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తూ దిగుబడులు పెరిగేందుకు దోహదపడుతోంది. ఏఐని ఉపయోగించుకున్న రైతులుకు దిగుబడి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎకరాకు సగటున 21 శాతం అధిక దిగుబడి సిద్ధించింది. పంటల సాగులో క్రిమిసంహారక మందుల వినియోగం 9 శాతం, ఎరువుల వాడకం 5 శాతం తగ్గింది. దిగుబడుల విక్రయ ధరలు మాత్రం 8 శాతం పెరిగాయి.

READ MORE: Mahesh Babu: రంగంలోకి మహేష్.. వరద బాధితుల కోసం కోటి విరాళం

ట్రాఫిక్ నియంత్రణపై ఏఐ..

రద్దీగా హైదరాబాద్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలలోనూ రోడ్లపై వాహనాల రాకపోకకలను సులబతరం చేసేందుకు ఏఐ సాయపడుతోంది. ఏఐ శక్తిదాయక వ్యవస్థలు వాహనాల రాకపోకలకు సంబంధించి సమాచారాన్ని సరైన సమయం(రియల్‌ టైమ్‌)లో విశ్లేషిస్తూ.. ట్రాఫిక్‌ లైట్లను నియంత్రిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌ రద్దీని కూడళ్లలో 30 శాతం మేరకు తగ్గించగలిగారు. కాలుష్యకారక ఉద్గారాలను 10 శాతం మేరకు తగ్గినట్లు సమాచారం.

READ MORE:Kerala: ఇన్సూరెన్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

అంటువ్యాధుల విజృంభణ

ఏఐ ఆరోగ్య భద్రతలో కూడా తోడ్పాటునందిస్తోంది. అంటువ్యాధుల విజృంభణను ముందస్తుగా మదింపు వేయడం, నిధులు అధికంగా, అత్యవసరమైన వ్యాధి నిరోధక కార్యకలాపాలకు కేటాయింపులు చేయడంలో సహాయపడుతోంది. కొవిడ్‌ మహమ్మారి కాలంలో ఆ అనారోగ్య హానికి గురయ్యేందుకు ఎక్కువ అవకాశమున్న ప్రజా సమూహాలను గుర్తించేందుకు ప్రెడిక్టివ్‌ ఎనలిటిక్స్‌ను ఉయోగించారు. ఇది మంచి ఫలితాలను అందించింది. ఏఐ ఆధారిత ఆరోగ్య భద్రతా పద్ధతులు మారుమూల గ్రామాల ప్రజలకు సైతం అత్యవసర వైద్య సలహాలు సత్వరమే, సుగమంగా సమకూరేందుకు సహాయపడుతున్నాయి.

READ MORE:తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సినీ ప్రముఖులు ఎంతెంత విరాళం ఇచ్చారంటే?

విద్యావ్యవస్థలోనూ ఏఐ పాత్ర..

ప్రభుత్వంలోని లోటుపాట్లను గుర్తించేందుకు ఏఐ ముఖ్యప్రాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ప్రభుత్వాల పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఏఐ ఆధారిత సాధనాలు దోహదపడుతున్నాయి. భారీ పరిమాణంలో ఉన్న సమాచారాన్ని విద్యుత్‌ వేగంతో మదించి, ప్రభుత్వ వ్యయాలలో అవకతవకలను కనుగొంటుంది. వనరులను మరింత వివేకవంతంగా వినియోగించేందుకు ఏఐ ఉపయోగపడుతోంది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఏఐని ఉపయోగించి.. అభ్యసన అనుభవాలను సమున్నతం చేసేందుకు కూడా ఏఐని వాడుతున్నాయి. ఏఐ ఆధారిత విద్యా వేదికలు వైయక్తిక అభ్యసన శైలిని మదింపు చేసి, అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను మారుస్తుంది. ప్రతి విద్యార్థికి వైయక్తికమైన విద్యాబోధన చేయడంలో విశేష పాత్ర పోషిస్తుంది.

READ MORE:UP: లక్నోలో దారుణం.. కదులుతున్న కారులో మోడల్‌పై గ్యాంగ్‌రేప్

పారిశ్రామిక రంగంలో మోసాల కట్టడిని ఏఐ చేయూత..

పారిశ్రామిక రంగంలో వివిధ సంస్థలు తమ యూనిక్‌ డేటా నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు, సమస్త వేల్యూ చైన్స్‌ (ముడిపదార్థాల సేకరణ, ఉత్పత్తి వినియోగం, త్యజించడం, రీసైక్లింగ్‌ ప్రక్రియతో సహా ఒక ఉత్పత్తి సంపూర్ణ జీవితచక్రాన్ని ఉద్దేశించిన భావన)ను తిరిగి ఊహించేందుకు, తమ సిబ్బంది, యంత్రాల పనితీరును విస్తారంగా మెరుగుపరచుకునేందుకు, కొత్త కల్పనలను ప్రోత్సహించేందుకు ఏఐ విశేషంగా తోడ్పడుతోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, బీమా రంగంలో అపార సమాచారాన్ని దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐ సహాయపడుతోంది. తద్వారా ముందస్తు అంచనా సామర్థ్యాన్ని మెరుగుపరిచి వాస్తవ సమయంలో మోసాలు, అక్రమాలను గుర్తించి నిరోధించడం సాధ్యమవుతోంది.

Show comments