Rape Case on Nivin Pauly: ఓ మహిళ ఫిర్యాదుతో నటుడు నివిన్ పౌలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో తనను వేధించారని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నివిన్ పౌలీపై కొత్తమంగళం ఒనుంకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు దర్యాప్తును చేపడుతుందని పోలీసులు తెలిపారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తనను వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. ఆమె నెరియమంగళం ఊనుంకల్‌కు చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘటన విదేశాల్లోనే జరిగిందని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నివిన్ పౌలీతో పాటు మరికొందరు తనను కూడా వేధించారని, అది ఒక వేధింపుల బృందం అని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. నెరియమంగళం ఒనుంకల్ పోలీసులు నమోదు చేసిన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించనున్నారు.
Upasana Kamineni Konidela: వెల్‌నెస్ ‘షార్క్’ – ఎంపరింగ్ విమెన్ ఎంటర్‌ప్రిన్యూవర్స్
ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. నివిన్ పౌలీ ఆరో నిందితుడు. ఎర్నాకులం రూరల్ ఎస్పీకి మొదటి ఫిర్యాదు వచ్చింది. అనంతరం ఈ కేసును పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నివిన్ పౌలీపై అత్యాచారం, మహిళలను అవమానించడం వంటి అభియోగాల కింద కేసు నమోదైంది. ఐపీసీ 376, 354, 376డీ సెక్షన్లు విధించారు. నిర్మాత ఎ.కె. సునీల్ రెండో నిందితుడు. గత నవంబర్‌లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నివిన్ పౌలీపై సిట్ బృందం విచారణ చేపట్టనుంది. శ్రేయ అనే మహిళ అవకాశం కల్పించి ఆ యువతిని విదేశాలకు తీసుకెళ్లింది. శ్రేయ మొదటి నిందితురాలుగా కేసు నమోదు చేశారు. ఇక హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత వెల్లడైన వివరాల్లో ఎర్నాకులంలో నమోదైన కేసుల సంఖ్య 11కి చేరింది.