Mahesh Babu Donates one Crore to Telugu Governments: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సినీ ప్రముఖులు భారీగా విరాళం ప్రకటిస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు సినీ ప్రముఖులు. ముందుగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల విరాళం అందించారు. ఇక విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున సీఎంల సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందించగా సిధ్ధూ జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 30 లక్షల విరాళం ఇచ్చారు.
Pawan Kalyan: ఏపీ వరదలు.. పవన్ కోటి విరాళం
తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీలు విరాళం ఇచ్చారు. రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ విరాళం ఇచ్చారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించగా నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి ప్రకటించగా ఇప్పుడు మహేష్ కూడా రెండు రాష్ట్రాలకు చెరి 50 లక్షల చొప్పున కోటి ప్రకటించారు. అయితే ఆసక్తికరంగా చిన్న హీరోయిన్ అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు చెరి 2.5 లక్షలు చొప్పున ఐదు లక్షలు ప్రకటిచింది.