Google Pixel 8 Pro Launch: రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఆపిల్ ఐఫోన్ 15 మరియు గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. మరోవైపు గూగుల్ ఈ ఏడాది మేలో పిక్సెల్ 7ఎ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా.. ఇది కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు గూగుల్ నుంచి మరో ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో పిక్సెల్ 8 ప్రోని ప్రారంభించవచ్చు. ఆపిల్ కూడా.. ఐఫోన్ 15 ను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే ప్రీమియం ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజల నిరీక్షణ కొన్ని నెలల తర్వాత ముగియనుంది. Pixel 8 Proకు సంబంధించి కొన్ని లీకుల ప్రకారం దాని ఫీచర్లు ఇలా ఉండే అవకాశముంది.
Heart Attack: గుండెపోటుతో అల్లుడు మృతి.. తట్టుకోలేక మామ మరణం
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్.. గూగుల్ పిక్సెల్ 8 ప్రోకి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశారు. Google యొక్క రాబోయే హ్యాండ్‌సెట్ OISతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రావచ్చు. అంతే కాకుండా.. 64 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వీడియో కాల్‌లు మరియు సెల్ఫీల కోసం 11-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చని తెలిపారు.
Opposition Alliance: విపక్షాల కూటమి కొత్త పేరు INDIA..
Google Pixel 8 Pro: డిస్ ప్లే మరియు స్టోరేజ్ కు సంబంధించి లీకుల ప్రకారం.. 6.7-అంగుళాల QHD, LTPO OLED డిస్‌ప్లే ఇవ్వబడుతుంది. మెరుగైన స్క్రోలింగ్ అనుభవం కోసం 120 Hz రిఫ్రెష్ రేట్ అవకాశం కూడా ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యొక్క టెన్సర్ G3 చిప్‌సెట్ సపోర్ట్ చేయబడుతుందని భావిస్తున్నారు. 12GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అందించవచ్చు. అంతే కాకుండా.. 12GB RAM మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 4,950mAh బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 27W వైర్డు ఛార్జింగ్‌తో అందించబడుతుంది. ప్రస్తుతానికి Google Pixel 8 Pro ధరను ప్రకటించలేదు. లాంచ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ వివరాలు రానున్నాయి.