Naseem Shah: నాకు హార్ట్ ఎటాక్ రాదని ఆశిస్తున్నా: పాక్ పేసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Pacer Naseem Shah Big Statement on Heart Attack After Last Over Heroics: శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డేలో 142 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం చివరి వరకు చెమటోడ్చాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో యువ సంచలనం నసీం షా పుణ్యమాని పాకిస్తాన్ గట్టెక్కింది. పాక్ విజయానికి చివరి రెండు బంతుల్లో 3 రన్స్ అవసరం కాగా.. ఐదో బాల్‌కు ఫోర్ బాదిన నసీం షా తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే చివరి ఓవర్లో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందని నసీం షా చెప్పాడు.
‘ఈ సంవత్సరం నాకు ఇన్నింగ్స్ ముగించే అవకాశాలు వస్తున్నాయి. ఏదో ఒకరోజు నాకు హార్ట్ ఎటాక్ మాత్రం రావొద్దని ఆశిస్తున్నా. ఆ అల్లా ఆశీస్సులతో నేను ఎల్లప్పుడూ ఇలానే ఆడుతుంటా. ఆ దేవుడి దయ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తేలికగానే అధిగమిస్తా. క్లిష్ట పరిస్థితుల్లో నన్ను నేను నమ్ముతాను. అల్లాకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని 20 ఏళ్ల నసీం షా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
‘నేను క్రీజు లోపలికి వెళ్లేసరికి షాదాబ్ ఖాన్ ఉన్నాడు. షాదాబ్‌పై నేను నమ్మకంగా ఉన్నా. మేము ఇద్దరం మ్యాచ్ పూర్తి చేస్తామని భావించా. కానీ షాదాబ్ పెవిలియన్ చేరడంతో కథ అడ్డం తిరిగింది. బౌలర్ ఉండడంతో అంతా నాదే భారం అని భావించాను. మ్యాచ్ గెలిపిస్తా అని నాపై నాకు నమ్మకం ఉంది. పాకిస్తాన్‌ను గెలిపించినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయం మాకు చాలా అవసరం. నెట్స్‌లో బ్యాటింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నందున ఇలాంటి పరిస్థితులను సులువుగా ఎదుర్కొంటున్నా’ అని నసీం షా చెప్పాడు.
Also Read: Pebble Smart Watch Price: వాయిస్ కాలింగ్‌తో సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (151), ఇబ్రహీం జర్దాన్ (80) చెలరేగారు. లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(91) రాణించినా.. మిడిలార్డర్ విఫలం అవ్వడంతో ఓటమి దిశగా సాగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్ (48) విజయాలను చిగురించాడు. చివరి ఓవర్లో 11 రన్స్ అవసరం కాగా.. నసీం షా రెండు ఫోర్స్ బాది ఊహించని విజయం అందించాడు.
Winning moments as #NaseemShah smashed back to back fours to Fazal Haq Farooqi pic.twitter.com/raQm2VJzRR
— Abdul Waheed Rabbani (@waheedrabbanipk) August 24, 2023
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!