తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్ లో ఇవాళ సమావేశం అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆదిత్య.. టీ-హబ్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీ-హబ్ ప్రత్యేకతల గురించి వివరాలు తెలుసుకున్నారు. టీ-హబ్ పనితీరు గురించి.. దానికి సంబంధించిన అంశాల గురించి పూర్తి వివరాలను కేటీఆర్ ను ఆదిత్య ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్ లో కేవలం టీ హబ్ గురించే కాదు జాతీయ పాలిటిక్స్ గురించి ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
Read Also : Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”
ఠాక్రే నేతృత్వంలోని టీమ్ హైదరాబాద్ లో టీ-హబ్ ను సందర్శించింది. స్వయంగా మంత్రి కేటీఆర్ వీరికి టీ హబ్ ను దగ్గర ఉండి చూపించారు. అర్భనైజేషన్ గురించి.. వివిధ పథకాల గురించి ఠాక్రే టీమ్ తెలుసుకుంది. టీ-హబ్ లోని ఇన్నోవేషన్స్ ను పరిశీలించారు. స్టార్టప్ లు.. వాటి ఆవిష్కర్తలు, ఆలోచన పరులు అద్భుతమని ఆదిత్యఠాక్రే ప్రశంసించారు. సుస్థిరత పట్టణీకరణ, టెక్నాలజీపై కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే చర్చించారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తీసుకున్నారు.
Read Also : Monsoon: ఈ ఏడాది సాధారణ రుతుపవనాలే.. వెల్లడించిన ఐఎండి..
దేశాభివృద్దిలో టెక్నాలజీ పాత్రపై.. దాని ప్రాముఖ్యత అసవరం గురించి ఇరువురు నేతలు చర్చించారు. మంత్రి కేటీఆర్ తో ఎప్పుడు సమావేశమైనా అది అద్భుతంగా.. ప్రోత్సాహభరితంగా సాగుతుందని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.. ఇరువురికి ఆసక్తికర అంశాలైన సుస్థిరత, పట్టణీకరణ, టెక్నాలజీ, దేశాభివృద్దిలో వాటి పాత్ర తదితర అంశాలపై భేటీలో చర్చించినట్లు ట్విట్ చేశాడు. దావోస్ భేటీ తరువాత మరోసారి ఆదిత్య ఠాక్రేతో భేటీ కావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి.. తాజా రాజకీయాల గురించి ఈ మీటింగ్ లో చర్చించినట్లు కేటీఆర్ అన్నారు.