పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా విడుదలయింది. కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది..ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అలాగే ఈ సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో కూడా రికార్డు క్రియేట్ చేసింది.. ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాలేదు.ఆ అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి మూడు రోజులు ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ ని సాధించింది.. కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయిల పైగా గ్రాస్ ని సాధించింది.ఆ తర్వాత నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు ఎంతో దారుణంగా పడిపోయాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.ఈ సినిమా నిరాశ పరచినప్పటికి కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో డైరెక్టర్ ఓం రౌత్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..
ఆదిపురుష్ సినిమాలో అరణ్యఖాండ నుండి యుద్ధ ఖాండ వరకు చూపించారు. ఇక పార్ట్ 2 లో అయోధ్య లో రాముడి పట్టాభిషేకం వంటి అంశాలను రెండవ భాగంగా చూపించాలని అనుకుంటున్నాడట డైరెక్టర్ ఓం రౌత్. అయితే రీసెంట్ గానే ఆయన ప్రభాస్ ని కలిసి ఈ సీక్వల్ గురించి ప్రస్తావించగా ఈ కథకి నేను అస్సలు కరెక్ట్ కాదు అని డైరెక్టర్ ఓం రౌత్ తో ప్రభాస్ అన్నట్లు సమాచారం.. కానీ ఈసారి వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తీసుకొని సినిమాను తెరకెక్కిస్తానని బడ్జెట్ ని కూడా లిమిట్ లో పెడతాను అనీ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటూ ప్రభాస్ ని డైరెక్టర్ ఓం రౌత్ బాగా రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.. అప్పుడు ప్రభాస్ ఒకసారి ఆలోచించుకొని చెప్తాను అని చెప్పినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.