కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ నేతలు, క్యాడర్ అంతా ఒకే బాట, ఒకే మాట. ఇపుడు ఆ పరిస్థితి లేదు.. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చింది. ప్రతీ సందర్భంలోనూ ఆయన్ను టార్గెట్ చేయడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. పార్టీకి నిత్యం వెన్నంటి వుండే ద్వితీయ శ్రేణి టీడీపీ సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పెత్తనం చేయడం వల్ల ఈ పరిస్థితి…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. మంగళగిరి వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు.. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు…