కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నిర్థిష్ట కాలంలో మాత్రమే వస్తుంటాయి. అయితే వాటికి సీజన్ తో సంబంధం లేకుండా తలెత్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యాధుల్లో ముఖ్యమైనవి గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలే ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యల్లో తొలి స్థానంలో ఉన్నాయి. ఇక ఈ సమస్యలు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే పరిణమిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
Also Read : CSK vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఈ క్రమంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవడం ద్వారా హృదయ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు సమస్య తలెత్తే ఛాన్స్ కూడా తగ్గుముఖం పడుతుంది.
Also Read : Atchannaidu: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను విడుదల చేయాలి
1.. నిమ్మ, ఆరెంజ్ : నిమ్మ, ఆరెంజ్ లను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండడమే దీనికి ప్రధాన కారణం. తద్వారా హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించగలవు.
2.. పియర్ : కొలెస్ట్రాల్ లోని తగ్గించే గుణాలు పియర్ లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీ గుండెను కాపాడగలుగుతుంది. ఇంకా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
Also Read : Director Teja: ఆ విషయంలో ప్రభాస్ 1000 రేట్లు గొప్పోడు
3.. యాపిల్ : యాపిల్ లో పుష్కలంగా ఉండే పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవి శరీరంలో మెటబోలిజం స్థాయిని పెంచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
4.. ద్రాక్ష : గుండె ఆరోగ్యాన్ని కాపాడే పండ్లలో ద్రాక్ష ప్రముఖమైనది. ద్రాక్షలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడుతాయి. తద్వారా గుండెను రక్షించుకోవడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
5.. బొప్పాయి : బొప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విజమిన్ సి లాంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. బొప్పాయితో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.