సొంతమైదానం పంజాబ్ కింగ్స్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతుంది. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు దూకుడుగానే ఆడుతోంది. అయితే, లక్నోపై మాత్రం భారీగా పరుగులు సమర్పించి చెత్త రికార్డును పంజాబ్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఏవిధంగా రాణిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధిస్తే మరోసారి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కి చేరే అవకాశం ఉంది.
Also Read : New Secretariat: గంటలోపే నూతన సచివాలయ ప్రారంభోత్సవం పూర్తి
అయితే గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ మూడు సార్లు విజయం సాధించగా.. ఈసారి ఫలితం ఎలాం ఉంటుదో వేచి చూడాలి. వాతావరణం చల్లగా ఉండటంతో బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే, వర్షం అడ్డంకిగా మారనుందని తెలుస్తోంది. దీంతో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read : Bopparaju Venkateswarlu: మూడో దశ ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన ఏపీ జేఏసీ ఛైర్మన్
భారీ హిట్టర్లు ఉన్న ముంబయి ఇండియన్స్‌ను అడ్డుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లు లక్నో చేతిలో మాత్రం చావుదెబ్బ తిన్నారు. మూడు మ్యాచుల తర్వాత వచ్చిన కెప్టెన్ ధావన్‌కు షాక్‌కొట్టినట్లైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 257/5 ఇచ్చిన జట్టుగా పంజాబ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే, కెప్టెన్ శిఖర్ ధావన్ విఫలమైన పంజాబ్ బ్యాటర్లు మాత్రం పోరాడి 200కుపైగా పరుగులు సాధించారు. ఇప్పుడు చెపాక్ స్టేడియంలో చెన్నైను ఓడించాలంటే మళ్లీ పంజాబ్ బౌలర్లు పుంజుకోవాల్సిందే. మరోవైపు భారీగా హిట్టింగ్ చేయగల బ్యాటింగ్ సామర్థ్యం సీఎస్‌కేకు ఉంది.
Also Read : TCS Employees: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు రెట్టింపుకు కసరత్తు..!
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ చేతిలోనే సీఎస్కే టీమ్ ఓటమిపాలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగువ్వాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదు విజయాలను నమోదు చేసుకోవాలి. బౌలింగ్‌లో అనుభవలేమి వల్ల కీలక మ్యాచుల్లో వెనుకబడాల్సిన పరిస్థితి నెలకొంది. తీక్షణ, దేశ్ పాండే, పతిరాణ, ఆకాశ్ సింగ్ అప్పుడప్పుడూ గాడి తప్పడంతో సీఎస్‌కేకు కష్టంగా మారింది. బ్యాటింగ్‌లోనూ అంబటి రాయుడు వరుసగా విఫలమవుతూ నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ బౌలర్లు అర్ష్‌దీప్, రబాడ, రాహుల్ చాహర్, సామ్ కర్రన్‌ను అడ్డుకోవడంపై చెన్నై బ్యాటర్లు దృష్టిపెట్టాలి.